Headlinesఅనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ

Link Copied!

కూసుమంచి మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బెల్లంకొండ నాగన్న, గుండా మోహన్ రెడ్డి, రాజుపేట గ్రామానికి చెందిన తూముల నాగమ్మను వారి నివాసాల్లో కలిసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో రాజుపేట గ్రామ సర్పంచ్ బానోత్ మహేష్, ఉపసర్పంచ్ సోలిపురం ప్రభాకర్ రెడ్డి, కందాళ కమలాకర్ రెడ్డి, షేక్ షరీఫుద్దీన్, షేక్ జానీ మియా, అప్పనపురి నరసింహచారి, కిన్నెర నర్సయ్య, సండ్ర వెంకన్న, మండల నాయకులు, గ్రామ ప్రజలు, యువతీ యువకులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles