
సూర్యాపేట జిల్లా మార్చి 11, కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో గల ఎరుకల నాంచారమ్మ తల్లి ఆలయం 6 వ వార్షికోత్సవం బుధవారం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునే అమ్మ వారికి అభిషేకాలు జరిపి తీరొక్కపూలతో అందంగా అలంకరించారు. భక్తులు అమ్మ వారిని దర్శించుకొని నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కరుణాకటాక్షంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో దేవాలయ చైర్మన్ కుంభం ఉపేందర్, వైస్ చైర్మన్ రోశయ్య, ఎరుకల కుల సంఘం అధ్యక్షులు వెలుగు లింగయ్య ఉపాధ్యక్షుడు సుల్తాని కృష్ణమూర్తి, స్థానిక కౌన్సిలర్లు రాయపూడి కాటం రాజు, సుల్తానీ సుజాత, రాంబాబు, గ్రామ పెద్దలు సామినేని రమేష్, ప్రమీల, నరేష్, రాధాకృష్ణ, అనంతరామయ్య ఎలుకల కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
