Headlinesరాష్ట్రాలకు 815 యుటీలకు 35 సీట్లు

రాష్ట్రాలకు 815 యుటీలకు 35 సీట్లు

Link Copied!

 లోక్ సభ స్థానాలు 850
రాష్ట్రాలకు 815 యుటీలకు 35 సీట్లు

దేశ రాజకీయ ముఖచిత్రం మారబోతున్నది. ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలతో ఉన్న దేశం త్వరలో గరిష్ఠంగా 850 స్థానాలకు విస్తరించబో తున్నది. ఈ మేరకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టను న్నది. ఇందుకోసం ఈ నెల 16, 17,18 తేదీల్లో పార్ల మెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత.. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అమ ల్లోకి రానున్నది. దీంతో పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించను న్నారు. ఈ రెండు పరిణామాలతో దేశ రాజకీయ స్వరూపం, స్వభావం సమూలంగా సము మారిపోనున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించలేదని, అభిప్రాయాలు సేకరిం చలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా దక్షి ణాది రాష్ట్రాలు సీట్ల పెంపు విధానంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తాము తీవ్రంగా నష్టపోతామని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలు చెప్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ‘ఎలాంటి అన్యాయం జరుగదు’ అని నోటిమాటగా చెప్తున్నదే తప్ప, తమ అనుమానాలను నివృత్తి చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ 2028లో జరగాల్సి ఉండగా, ఇంత అత్యవ సరంగా మూడేండ్ల ముందుగానే చేయాల్సిన అవ సరం ఏమున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనాభా గణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త లెక్కల ఆధారంగా నియోజ కవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, బిల్లు లను ఆమోదింపజేసేందుకు సిద్ధమైందని వివిధ రాజ కీయ పక్షాలు విమర్శిస్తున్నాయి.

తాజా వార్తలు

Related Articles