
నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతి మా సింగ్
ది లీడర్స్ డైరీ: మే 03 న జరగనున్న యూజీసీ-నీట్ పరీక్షకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు ఆదేశించారు.
(UGC-NEET) పరీక్షకు సంబంధించి సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ నగేష్ రెవిన్యూ,పోలీస్,మెడికల్ అండ్ హెల్త్ టీజీ ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ,ట్రాన్స్పోర్ట్, ఇంటర్మీడియట్,పోస్టల్,ఆర్డిఓ విద్యా,వైద్య శాఖ అధికారులు, పలువురు ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,మే 03వ తేదీ మధ్యాహ్నం ,02.00 గంటల నుండి సాయంత్రం 05.00 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్షకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు,నిరంతర విద్యుత్, శానిటేషన్,తరగతి గదుల శుభ్రత,బెంచీలు,బస్ సదుపాయం వంటి మౌలిక సదుపాయాలన్నీ ఈనెల 30వ తేదీ లోపు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
ఈసమీక్ష సమావేశంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య,డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు,డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నీట్ కోఆర్డినేటర్ ప్రిన్సిపల్ హుస్సేన్ ఇతర అధికారులు, ప్రిన్సిపల్స్ హాజరయ్యారు.
