Headlines15వ ఆర్థిక సంఘం నిధులపై ఆరోపణలు అవాస్తవం: పంచాయతీరాజ్ శాఖ

15వ ఆర్థిక సంఘం నిధులపై ఆరోపణలు అవాస్తవం: పంచాయతీరాజ్ శాఖ

Link Copied!

15వ ఆర్థిక సంఘం నిధులపై ఆరోపణలు అవాస్తవం: పంచాయతీరాజ్ శాఖ

15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 52 ప్రకారం గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ గ్రామ పంచాయతీల చట్టబద్ధమైన బాధ్యత అని, అందువల్ల వాటికి సంబంధించిన విద్యుత్ బిల్లుల చెల్లింపులు కూడా గ్రామ పంచాయతీల విధుల్లో భాగమేనని తెలిపింది.

కేంద్ర ఆర్థిక సంఘం నిధులను నిర్దేశిత ప్రయోజనాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వినియోగిస్తోందని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది.

శాఖ వివరాల ప్రకారం, టైడ్ గ్రాంట్లు తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి నిర్దిష్ట పనులకే వినియోగిస్తారు. అయితే అన్‌టైడ్ గ్రాంట్లు గ్రామ పంచాయతీల పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవచ్చని పేర్కొంది. ఇందులో కమ్యూనిటీ ఆస్తుల నిర్వహణ, వీధి దీపాల విద్యుత్ బిల్లుల చెల్లింపులు వంటి ఖర్చులు కూడా చట్టబద్ధంగా వస్తాయని స్పష్టం చేసింది.

తాజా వార్తలు

Related Articles