Headlinesబట్లదిన్నె గ్రామంలో రీ-సర్వేపై రైతులకు అవగాహన సమావేశం

బట్లదిన్నె గ్రామంలో రీ-సర్వేపై రైతులకు అవగాహన సమావేశం

Link Copied!

యర్రవల్లి మండలం, బట్లదిన్నె గ్రామం వ్యవసాయ భూముల రీ-సర్వే (Re-Survey) చేపట్టేందుకు ఎంపిక కావడంతో, రైతులు మరియు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించే సమావేశాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ శుభకర్ అధ్యక్షత వహించగా, యర్రవల్లి మండల తహసీల్దార్ నరేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ అధికారి గౌరీ, పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్ ప్రభాకర్, గ్రామ రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు రీ-సర్వే ప్రక్రియ, దాని వల్ల కలిగే ప్రయోజనాలు, భూ రికార్డుల ఖచ్చితత్వం, సర్వే సమయంలో రైతులు పాటించాల్సిన సూచనలు వంటి అంశాలను వివరించారు. రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు.

అనంతరం రైతులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చి, రీ-సర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

తాజా వార్తలు

Related Articles