Headlinesనిధుల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలి

నిధుల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలి

Link Copied!

నిధుల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలి

సర్పంచ్ విజయ్ కుమార్ కు డిజిటల్ కీ అందజేస్తున్న మండల పరిషత్ సిబ్బంది.

ది లీడర్స్ డైరీ: సర్పంచ్లు, ఉపసర్పంచ్లు 15వ ఆర్ధిక సంఘం నిధుల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని ఎంపీ డీవో విశ్వప్రసాద్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో 15వ ఆర్థిక సంఘం నిధుల లావాదేవీ లపై ఆయా గ్రామాల సర్పంచ్లకు, ఉప సర్పంచ్ లకు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఇప్ప టివరకు ఆ నిధులకు సంబంధించి డిజిటల్ సిగ్నేచర్ కంప్యూటర్ ఆపరేటర్ల వద్ద ఉండేదని, ప్రస్తుతం ప్రభు త్వం సర్పంచ్లకు అందజేసినట్లు తెలిపారు. పంచాయ తీల్లో నిధులు దుర్వినియోగం కాకుండా గ్రామ స్వరాజ్ పోర్టల్లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

బషీరాబాద్: ఐర్లాపూర్ సర్పంచ్  డిజిటల్ కీ అందజేస్తున్న ఎంపీడీవో సంపత్ కుమార్ కార్యక్రమంలో సర్పంచ్లు సిరిగిరిపేట్ స్వరూప, పటేల్ సుదర్శ న్ రెడ్డి, రాంరెడ్డి, మైలారం రాజ్కుమార్, జర్నె సుజన, పిట్ల అనసూయ, పట్లోళ్ల చంద్రకళ, ఎంకెపల్లి ప్రవీణ్ గౌడ్, వడ్డె చెన్నప్ప, మాల నర్సమ్మ, నాగలక్ష్మి ఉన్నారు.

ఆర్థిక సంఘం నిధులపై అవగాహన

పంచాయతీలకు విడుదలయ్యే వివిధ రకాల నిధులపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని బషీరాబాద్ ఎంపీడీవో సంపత్కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో 15వ ఆర్థిక సంఘం నిధులపై సర్పంచ్, ఉప సర్పంచులకు అవగాహన కల్పించారు. సర్పంచ్, ఉప సర్పంచ్లకు ఎంపీడీవో డిజిటల్ కీలను అందజేశారు.

తాజా వార్తలు

Related Articles