Headlinesపిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమాలు

పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమాలు

Link Copied!

పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమాలు 

  • రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి జెన్నపల్లి పద్మకృష్ణ

ది లీడర్స్ డైరీ:  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని.. మాణిక్యమ్మ గూడా. గ్రామ సర్పంచ్, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ… ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో కిషోర బాలికలు, పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడ్డాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఒకేసారి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి బాలికల హక్కులు, భద్రతపై చైతన్యం కల్పించారు బాల్య వివాహాల నివారణ, బాలికల విద్య, మహిళలపై హింస నివారణ వంటి కీలక అంశాలపై వివరణాత్మకంగా చర్చించారు. 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వివాహాలు జరపకూడదని, ప్రతి ఆడపిల్ల తప్పనిసరిగా చదువు కొనసాగించాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టడం సమాజ బాధ్యతగా భావించాలని, మహిళలపై ఎలాంటి హింస జరిగినా ఎదుర్కొనే ధైర్యం పెంపొందించుకోవాలని అవగాహన కల్పించారు. అలాగే కిశోర బాలికల అభివృద్ధి కోసం 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలతో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు. చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సంఘాల ద్వారా బాలికలకు నాయకత్వ లక్షణాలు, స్వీయ రక్షణ, ఆరోగ్య అవగాహన వంటి అంశాల్లో శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. టీనేజ్ వయస్సులో గర్భధారణకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహాలు చేసుకోవద్దని స్పష్టంగా సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు విభాగ ప్రతినిధులు, ఐసిడిఎస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, మండల సమాఖ్య సభ్యులు, సీసీలు, కిశోర బాలికలు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ కిరణ్యయి ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) శ్రీలత మాణిక్యాస్ముగూడ సర్పంచ్.. రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి జెన్నపల్లి పద్మ కృష్ణ బాలికల భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించి, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు

తాజా వార్తలు

Related Articles