Headlinesమధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు

మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు

Link Copied!

మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు

ప్రజలకు ఆరోగ్యశాఖ సూచనలు

ది లీడర్ డైరీ : రాష్ట్రంలో రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేప ధ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందించేలా ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. దీంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రులకు, ప్రజలకు సూచిస్తూ వైద్యారోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘భారీ ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ కేసులు పెరిగే అవకాశ ముంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలి. గ్రామస్థాయిలో ఏఎన్ఎం, ఆశా, అంగన్ వాడీ సిబ్బంది ద్వారా ఓఆర్ఎస్ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి. ప్రజలు కూడా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయ టకు వెళ్లకూడదు. తగినంత నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం తీసుకో వాలి. బయటికి వెళ్లేటప్పుడు తలకు టోపీ, తువ్వాలు వంటివి ధరించాలి.

మసాలా, ఆయిల్ ఫుడ్ తినడం తగ్గించాలి. వడదెబ్బ లక్షణాలు గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడం, తల తిరగడం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం, అపస్మారక స్థితికి చేరుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి’ అని అందులో సూచించింది.

తాజా వార్తలు

Related Articles