ఎస్సీ యువతకు ఎలక్ట్రిక్ వాహనాలు
స్వయంఉపాధికి వీలుగా యూనిట్ల రూపకల్పన
పశుసంపద, సోలార్ యూనిట్లకూ ప్రాధాన్యం
మొత్తం 10 వేల మందికి పైగా ప్రయోజనం
ఎస్టీ కార్పొరేషన్ కింద నైపుణ్య శిక్షణ
ది లీడర్ డైరీ: రాష్ట్రంలో ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం కార్యాచరణ సిద్ధ మైంది. పైలట్ ప్రాజెక్టు కింద ఎస్సీ కార్పొరేషన్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, పశుసంపద, సోలార్ రంగాల్లో 10 వేల మందికి పైగా ఉపాధి కల్పించ నుంది. దాదాపు రూ.219 కోట్లతో చేపట్టనున్న కార్యక్రమం కోసం దరఖాస్తులు స్వీకరించింది. వచ్చే వారం నుంచి జిల్లా స్థాయిలో అర్హులను ఎంపిక చేయనుంది. తక్కువ ఖర్చుతో మెరుగైన ఉపాధి కోసం యువతకు ఈ-వాహనాలు అందిం చనుంది. దానివల్ల వారు ఈ-కామర్స్, లాజిస్టిక్స్ వ్యాపారాలను నిర్వహించుకుని, ఆదాయం పొంద వచ్చని భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు సరఫరా చేసేందుకు తయారీదారుల నుంచి ఆసక్తి వ్యక్తీక రణ ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఈ నెలాఖరు లోగా సరఫరా సంస్థలను ఖరారు చేయనుంది. పైలట్ ప్రాజెక్టు కింద 5,016 మందికి టూ వీలర్స్ ఈవీలు ఇవ్వాలన్నది కార్పొరేషన్ లక్ష్యం. ఇప్పటికే 29,788 మంది ఆసక్తి చూపారు. అర్హులను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ. లక్ష విలువైన ఎలక్ట్రిక్ వాహ నాలు ఇవ్వనుంది. రవాణా, ప్రజారవాణా కోసం 3 వీలర్ ఈవీ యూనిట్ వ్యయాన్ని రూ.3 లక్ష లుగా నిర్ణయించింది. 2,508 యూనిట్ల కోసం 35,725 దరఖాస్తులు అందాయి.
* పడావు భూములను సాగులోకి తెచ్చేందుకు 500 మందికి సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులు అందిం చనుంది. ఎస్సీలకు సంబంధించిన భూములకు విద్యుత్తు సౌకర్యం, బోరుబావి లేకపోవడంతో జీవ నోపాధి కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇందిర గిరిజల వికాసం తరహాలో ఎస్సీ భూములకు సాగునీటి వసతి కల్పించేందుకు సోలార్ పథకాన్ని రూ.3లక్షలు-7 లక్షల వ్యయంతో అమలు చేయ నుంది. మొత్తం 2029 మంది దరఖాస్తు చేశారు. పశుసంపద పథకం కింద 2,473 యూనిట్లు ఉండగా 1,159 మంది ఆసక్తి చూపారు దరఖాస్తు గడువు గురువారంతో ముగియనుంది.
యూనిట్ వ్యయం ఆధారంగా…
యూనిట్ వ్యయం ఆధారంగా కార్పొరేషన్ 60. నుంచి 90 శాతం వరకు సబ్సిడీ ఇవ్వనుంది. రూ. లక్ష యూనిట్ వరకు 90 శాతం, రూ. లక్ష-2 లక్షల యూనిట్ కు 80శాతం, రూ.2 లక్షలు-4 లక్షల యూనిట్ కు 70శాతం, రూ. 4లక్షలకు పైగా ఉండే యూనిట్ కు 60శాతం (గరిష్టంగా యూనిట్ విలువ రూ.5 లక్షలు) సబ్సిడీ అందుతుంది.
గిరిజన సంక్షేమ శాఖలో...
రాష్ట్రంలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఐటీడీఏ, మైదాన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద 10,500 మందికి వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వనుంది. దాదాపు రూ. 10కోట్లు ఖర్చుచేయ నుంది. మే 1 నుంచి శిక్షణ కార్యక్రమాలను ప్రారం బించాలని భావిస్తోంది. ప్రదాన మంత్రి కౌశల్ వికాస్ యోజన తరహాలో ఈ పథకాన్ని అమలు చేయ నుంది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కోసం రూ.20 కోట్లు కావాలంటూ ట్రైకార్ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి నిధులు రాకుంటే రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతో పథకాన్ని చేపట్టాలని భావిస్తోంది. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 2,700 మంది చొప్పున 8100 మందికి, మైదాన ప్రాంతాల్లో 2400 మందికి ఈ శిక్షణ అందించనుంది. అర్హులను ఎంపిక చేయాలని ఇప్పు టికే ఐటీడీఏ పీవోలకు ట్రైకార్ లేఖలు రాసింది.
