Headlinesపుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు: సీఎస్

పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు: సీఎస్

Link Copied!

పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు: సీఎస్

ది లీడర్స్ డైరీ: ఎనిమిది జిల్లాల్లో గోదావరి పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని సీఎస్ కె. రామకృష్ణారావు అధికారుల్ని ఆదేశించారు. గురువారం సచివాలయంలో పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘కందకుర్తి నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలోని 8 జిల్లాలో గోదా వరి నదీ పరివాహక ప్రాంతముంది. ఈ జిల్లాలో పుష్కర స్నానాలకు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భారీగా ఏర్పాట్లు చేయాలి. ఏర్పాట్లపై సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే చేసిన సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలి. గోదా వరి పుష్కరాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక సమర్పించాలి’ అని సీఎస్ అధికారులకు సూచించారు. సమావేశంలో శైలజా రామయ్యర్, హనుమంతరావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వార్తలు

Related Articles