కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన
TRS.. పాత పేరు కొత్తగా..
ది లీడర్స్ డైరీ: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘TRS’ తెరపైకి వచ్చింది. గతంలో KCR ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ఊరూరా ప్రజల్లోకి వెళ్లింది. కానీ BRSగా మారడంతో తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయిందనే విమర్శలొచ్చాయి. పార్టీ పేరు మార్చాక నష్టపోయామని ఇటీవల KTR కూడా చెప్పారు. ఈ క్రమంలో సెంటిమెంట్‌ను కొనసాగించేలా పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తామని కవిత చెప్పారు. అన్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర సేనను ప్రకటించారు.
