Headlinesమూడేళ్ళలో పంచాయితీలకు శాశ్వత భవనాలు

మూడేళ్ళలో పంచాయితీలకు శాశ్వత భవనాలు

Link Copied!

మూడేళ్ళలో పంచాయితీలకు శాశ్వత భవనాలు

హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి నిధుల మంజూరు

 వివిధ శాఖల అధికారులతో డిప్యూటి సిఎం భట్టి సమీక్ష

రాబోయే మూడేళ్లలో శాశ్వత భవనాలు లేని అన్ని గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ను పురస్కరించుకుని మంగళవారం వివిధ శాఖల అధికారులు, మంత్రులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమై, హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి నిధుల మంజూరుపై సమీక్షించారు.

‘తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ఉపాధి కల్పించే కోర్సులు ప్రవేశపెట్టాలి. గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలతో ఏటీసీ కోర్సులు ప్రారంభిస్తాము. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక మైనింగ్ ట్రైబల్ ఏజెన్సీల ద్వారానే జరగాలని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఐటీడీఏల సహకారంతో గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి.

తెలంగాణ పర్యాటక రంగాన్ని ఉ న్నత స్థాయికి తీసుకెళ్లాలి. కవ్వాల్, శ్రీశైలం టైగర్ జోన్ల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. ప్రభుత్వం ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై చర్యలు తీసుకుంటుంది. డ్రగ్స్ మహమ్మారి నివారణకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. డ్రగ్స్ దుష్పభ్రావాలపై కళారూపాల ద్వారా యువతకు అవగాహన కల్పించాలి’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇదిలావుంటే రాష్ట్రంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

గ్రామాల అభివృద్ది, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల పాత్రను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడెట్ వినియోగం, వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. 11 అధికారులకు సూచించారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం విభాగాల వారీగా అధికారులు ఐడెట్ ప్రతిపాదనలు నమర్పించగా వాటిలో పలు మార్పులు చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయించుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఒక్క రూపాయి కూడా, పెండింగ్ పడకుండా, వెనక్కి పోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశిరచారు. గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా గ్రామాలకు కేంద్ర నిధులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని, ఈనేపథ్యంలో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటాను సాధించాలని అధికారులకు దిశానిర్దేశర చేశారు. కేంద్రానికి రాష్ట్రం భారీగా పన్నులు చెల్లిస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా సాధించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తే అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్ధిక సంఘం నిధులు పెండింగ్లో ఉన్నాయని, అవసరమైన యుటిలిటీ సర్టిఫికెట్లు సమర్పించి వాటిని త్వరగా విడుదల చేయించు కోవాలన్నారు. 99 రోజుల ప్రణాళికల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నంబర్ వన్ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. జిల్లాల వారీగా నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాలను త్వరితగతిన పూర్తి వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి ఈ భవ నాలను ప్రారం భించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆనంతరం వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్యక్రమంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆదివాసి, ఏజన్సి, గిరిజన ప్రాంతాల్లో అనేక వాగులు ఉన్నప్పటికీ వేసవికాలంలో సాగు, తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

తాజా వార్తలు

Related Articles