Headlinesఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం

Link Copied!

ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం

ది లీడర్ డైరీ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంతో నిరు పేద కుటుంబాల సొంతింటి కల అన్నారు. కడ్తాల్ మండలంలోని హనుమాస్పల్లి గ్రామంలో లబ్దిదారులు కవితా సురేష్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను సోమవారం టీపీసీసీ సభ్యులు అయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యాట గీత నర్సింహ, సర్పంచ్ శ్రీను నాయక్, ఉప సర్పంచ్ క్యాతిక మహేష్ లతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగు తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందుతున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డీసీసీ ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి శంకర్, కంబాల రామకృష్ణ, వార్డు సభ్యులు రామావత్ దేవుల, కంబాల ప్రశాంత్, రావుల జగన్ గౌడ్, కొర్ర కిషన్, శాంతి నేనావత్ మోతిలాల్, రావులా పద్మ రాజు గౌడ్, రామావత్ రేణుక శివ, చంచాయితీ కార్యదర్శి ఇందిరా, నేనావత్ భజ్జ శ్రీను చంద్రునాయక్, పోతిగంటి నర్సిమ్మ, రామావత్ రాజు నాయక్, రమేష్ నాయక్, నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

 

తాజా వార్తలు

Related Articles