Headlinesకులవృత్తులను ప్రోత్సహించాలి

కులవృత్తులను ప్రోత్సహించాలి

Link Copied!

కులవృత్తులను ప్రోత్సహించాలి – చెందనవె సర్పంచ్ నవనీత స్వామి

ది లీడర్స్ డైరీ : కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న వారిని ప్రోత్సహించాలని చందనవెల్లి సర్పంచ్ నవనీత స్వామి తెలిపారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారి సౌజన్యంతో కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న (రజక నాయి బ్రాహ్మణ) వారిని గుర్తించి వారి ఆర్థిక బలోపేతానికి ఉపయోగపడే పరికరాలను (బ్యాండ్ బాజా) అందించారు. లబ్ధిదారులు మాట్లాడుతూ మమ్మల్ని గుర్తించి మేము అడగకుండానే సహాయం చేసినందుకు సర్పంచుకు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీశైలం, మంగలి రామస్వామి, చాకలి పైలయ్య, శ్రీరాములు, రమేష్, యాదయ్య, మహేష్, మల్లేష్, సురేష్, నవీన్, అశోక్, బోడ వెంకటయ్య, సత్తయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles