Headlinesబాకారం జాగీర్లో అండర్ డ్రైనేజీ పనుల ప్రారంభం

బాకారం జాగీర్లో అండర్ డ్రైనేజీ పనుల ప్రారంభం

Link Copied!

బాకారం జాగీర్లో అండర్ డ్రైనేజీ పనుల ప్రారంభం

అండర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్

ది లీడర్స్ డైరీ : మొయినాబాద్  మండల పరిధిలోని బాకారం జాగీర్ గ్రామ పంచాయ తీలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోంది. ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ,సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామ సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్ ముందుకు సాగుతున్నారు. గత కొంతకాలంగా గ్రామ పరిధిలోని 5వ వార్డులో అండర్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్న విషయం సర్పంచ్ దృష్టికి వచ్చింది.వార్డు ప్రజలు పడుతున్న అవస్థలను స్వయంగా పర్యవేక్షించిన సర్పంచ్, వెంటనే స్పందించి డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. ఉపసర్పంచ్ సుభాష్ చంద్రబోస్ రెడ్డి, వార్డు సభ్యులు రాయనోళ్ల ఉపేందర్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి శివశంకర్ లతో కలిసి ఆయన పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచవెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. “గ్రామ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే మా ప్రథమ ప్రాధాన్యత. దశల వారీగా గ్రామంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తాం.. పెండింగ్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్క రిస్తూ, బాకారం జాగీర్ను మండలంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం” అని ధీమా వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బిక్షపతి గౌడ్, శ్రీకాంత్, గజానంద్ రెడ్డి, తిరుపతి, కరోబర్ జగన్నాథ్ మరియు గ్రామ పెద్దలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles