
రాంపూర్ గ్రామంలో 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) నిధులతో చేపట్టనున్న చిలుకం శేఖర్ ఇంటి నుండి సీసీ రోడ్డు వరకు అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులను ఈరోజు గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల – శ్రీశైలం యాదవ్ కొబ్బరికాయలు కొట్టి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా నాణ్యతతో, వేగవంతంగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని సర్పంచ్ వట్టెల నిర్మల – శ్రీశైలం యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సప్పిడి ఆంజనేయులు , గ్రామ సెక్రటరీ రవీందర్ , GPO శ్రీశైలం , వార్డు సభ్యులు సప్పిడి సునీత (M/O శివ), దొరిబాయి లాలమ్మ – జంగయ్య, కటికల మధు యాదవ్, కాకి రాము, పెరుమళ్ళ నరేష్, రాంపూర్ చెరువు చైర్మన్ చిలుకం బిక్షపతి , జనరల్ సెక్రటరీ చిలుకం శేఖర్ , డైరెక్టర్లు తిక్కల యాదయ్య, తిక్కల మహేష్, మాజీ సర్పంచ్ మనమ్మ – యాదయ్య, మాజీ ఎంపీటీసీ కటికల భీమమ్మ – యాదయ్య, హనుమాన్ మాజీ టెంపుల్ చైర్మన్ జానయ్య, లక్ష్మీ వెంకటేశ్వర మాజీ టెంపుల్ చైర్మన్ ముక్తాల రాఘవేందర్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు మీసాల ఆంజనేయులు, గ్రామ పెద్దలు ముక్తాల నరసింహ, యామ లక్ష్మణ్, తిక్కల అంజయ్య, షర్ఫుద్దీన్, యువ నాయకులు రొయ్యల రమేష్, బోదాస్ నరసింహ, రొయ్యల మహేష్, రొయ్యల పెద్దయ్య, చిలుకం నరేష్, తిక్కల శివ, వినోద్, రొయ్యల అనిబాబు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
