
గ్రామ సర్పంచ్ శీను నాయక్ సొంత డబ్బులతోఅంగన్వాడి కేంద్రానికి ఫ్యాన్, విద్యార్థులకు పలకలు అందజేత
ది లీడర్స్ డైరీ: మన వార్తా ప్రతినిధి కడ్తాల్ మండలం హనుమాన్ పల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంను సందర్శించిన గ్రామ సర్పంచ్ నేనావత్ శ్రీను నాయక్ వేసవి కాలం దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బంది ఉండకూడదు అనే ఉదేశ్యంతో ఒక ఫ్యాన్ మరియు విద్యార్థులకు పలకలు తన సొంత నిధులతో విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శీను నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ ప్రారంభం అయ్యేది అంగన్వాడీ నుండి అని అన్నారు. బాల్య దశ నుండే క్రమ శిక్షణ నేర్చుకోవచ్చని అన్నారు నేటి బాలలే రేపటి భవిష్యత్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నేనావత్ శ్రీను నాయక్, ఉపసర్పంచ్ క్యాతిక మహేష్ యాదవ్, వార్డు సభ్యులు రామావత్ దేవుల, కంబాల ప్రశాంత్, రావుల జగన్ గౌడ్, కొర్ర శాంతికిషన్ నాయక్, నేనావత్ మోతిలాల్, రావుల పద్మ రాజ్ గౌడ్, రామావత్ రేణుక శివ నాయక్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, జాంబలబాయి తండా మహిళలు, గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు.
