అత్యుత్తమ పంచాయతీగా విట్టునాయక్ తండా
ది లీడర్స్ డైరీ: సంగారెడ్డి జిల్లా విట్టునాయక్ తండాను అత్యు త్తమ గ్రామ పంచాయతీగా కేంద్రం ఎంపిక చేసింది. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి మంత్రిత్వశాఖ పంచాయతీ అభివృద్ధి సూచిక (అడ్వాన్స్మెంట్ ఇండెక్స్) 2.0 నివేదికను బుధవారం విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తదితర తొమ్మిది
పేదరికం, ఆరోగ్యం అంశాలవారీగా..
అంశాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీల పనితీరు ఆధారంగా ఐదు గ్రేడ్లుగా విభజించింది. తెలంగాణలోని మొత్తం12,566 గ్రామాలను పరిశీలించి విట్టునాయక్ తండాను అత్యుత్తమ పంచాయతీగాప్రకటించింది. వివిధ అంశా(థీమ్)ల వారీగా ఉత్తమ పంచాయతీలనూ ఎంపిక చేసింది.
పేదరిక నిర్మూలన, జీవనోపాధి: నల్గొండ జిల్లా రావుల పెంట • ఆరోగ్యకరమైన పంచాయతీ: నిర్మల్ జిల్లా వెంకూరు మహిళా స్నేహపూర్వక పంచాయతీ: సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి • శిశుస్నేహపూర్వక పంచా యతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటంపల్లి సామాజిక న్యాయం, భద్రత: రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటంపల్లి • నీటి సమృద్ధి: వరంగల్ జిల్లా పాతముగ్గుపురం • స్వచ్ఛత, పచ్చదనం: వరంగల్ జిల్లా నారాయణ తండా స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలు: హనుమకొండ జిల్లా ఉడుతగూడెం సుపరిపాలన: వికారా బాద్ జిల్లా మోతుకుపల్లి
