Headlinesమహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

Link Copied!

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

ది లీడర్స్ డైరీ : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తలకొండపల్లి మండలంలోని లింగరావుప ల్లి గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గ్రామంలో ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో నెల రోజుల పాటు మహిళలకు నిర్వ హించే మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం సర్పంచ్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కోరారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకట్రెడ్డి, ఐకేపీ ఎపీఎం రామస్వామి, సీసీ దీప, శివ, రామానుజమ్మ, డైరెక్టర్ సురేంద్రబాబు, నాయకులు జం గయ్య, శేఖర్, సుమన్, సాత్విక, మమత, వనజ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles