
ఉచిత కళ్లద్దాల పంపిణీ
ది లీడర్స్ డైరీ: షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ ‘మండలం చౌలపల్లి గ్రామంలో ప్రజా పాలన -99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత కళ్లద్దాల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామసర్పంచ్ జంగయ్య ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన కళ్లద్దాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
