
నేటి నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు
ది లీడర్స్ డైరీ: సరస్వతీ నది అంత్య పుష్కరాలు గురువారం ప్రారంభంకాను న్నాయి. ఉదయం 5.43 నిమిషాలకు కంచి కామ కోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రి శ్రీధర్ బాబు వీటిని ప్రారంభించనున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తొలి సారి అంత్య పుష్కరాలు నిర్వహిస్తోంది. దీనికోసం రూ.30 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో కాళేశ్వరం పరిసర ప్రాంతాల నుంచి నదీ తీరాని కొచ్చే మార్గాల్లో రోడ్లను అభివృద్ధి చేశారు. ప్రత్యే కంగా మ్యూజియాన్ని నిర్మించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అసౌకర్యం కలగకుండా భారీ టెంట్లు, కూలర్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి కేంద్రాలు విరివిగా అందుబాటులో ఉంచా లని నిర్ణయించారు. పార్కింగ్ కోసం 250 ఎకరా లను సమీకరించారు. అక్కడ వాహనాలు నిండితే దూరప్రాంతంలో అపేసి అక్కడి నుంచి ఉచిత బస్సు సౌకర్యం ద్వారా భక్తులను నది వద్దకు తీసు కొచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
300 గదుల ఏర్పాటు..
సరస్వతీ ఘాట్ తోపాటు ప్రధాన సూట్ వద్ద స్నానాలు ఆచరించేవారు దుస్తులు మార్చుకొనేం దుకు తాత్కాలిక గదులను 300కు పైగా ఏర్పాటు చేస్తున్నారు. నదిలో లోతులోకి వెళ్లకుండా భద్రతా చర్యల్లో భాగంగా తాళ్లతో హద్దులు ఏర్పాటు చేస్తు న్నారు. జూన్ 1 వరకు ప్రతిరోజు సాయంత్రం హారతి ఉంటుంది. అంత్య పుష్కరాలకు భక్తులు. పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు సరస్వతి ఘాట్ వద్ద పుష్కరాల కోసం విస్తృత ఏర్పాట్లు ఒడిశా, మహారాష్ట్ర చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని అధికారులు చెబుతున్నారు.
పుష్కర విశిష్టత..
ప్రాణహిత, గోదావరి నదుల్లో అంతర్వాహిణిగా సరస్వతి నది ప్రవహిస్తున్న ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ధి చెందింది. దేశంలో సరస్వతి నది ఉన్నది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్జ్, రెండోది కాళేశ్వరం లోనే అక్కడ కుంభమేళా నిర్వహించటం ఆనవాయితీ. కాగా, తెలంగాణలో తొలిసారి అంత్య పుష్క రాలకు సైతం ప్రాధాన్యమిచ్చి ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేయటం విశేషం. అది పుష్క రాల్లో నది స్నానం ఆచరించటం.. పితృతర్పణాలు ఇవ్వడం ఎలా ఫలితాలొస్తాయో.. అంత్య పుష్కర సమయంలోనూ ఆయా కార్యక్రమాలతో అవే ఫలి తాలుంటాయని పండితులు చెబుతున్నారు.
పుష్కరాలను వైభవంగా జరుపుకోవాలి: సీఎం సరస్వతి అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొ న్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సదుపా యాలు వంటి అన్నిరకాల ఏర్పాట్లను సమర్థంగా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు తమ ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచిం చారు. ఈ మేరకు సీఎం కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
