Headlines16 వ ఆర్థిక సంఘం నిధులకు విద్యుత్ బకాయిలతో లంకె

16 వ ఆర్థిక సంఘం నిధులకు విద్యుత్ బకాయిలతో లంకె

Link Copied!

16 వ ఆర్థిక సంఘం నిధులకు విద్యుత్ బకాయిలతో లంకె
తక్షణం రూ.392.58 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశం.

కేంద్ర ప్రభుత్వం నుంచి 16వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులను పొందేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పెండింగ్ కరెంట్ బిల్లులను వెంటనే చెల్లించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత జనవరి నుంచి ఈ నెల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,760 గ్రామాల్లో రూ.8,16,118 కోట్ల బిల్లులు కింద రూ.392.58 కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని మంగళవారం వరకు చెల్లించాలని సూచించింది.

కేంద్రం 16వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రూ.9,668 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రస్తుతం రూ.1,280 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, పంచాయతీలకు వివిధ బకాయిలు ఉండడం ఇతర కారణాలతో నిధులు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

తాజా వార్తలు

Related Articles