కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుకుంటున్న సర్పంచ్!

నల్లగొండ మండలం అన్నపురెడ్డిగూడెం సర్పంచ్ తీగల యాదయ్య ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రాజకీయాల్లో చిన్న పదవి ఉన్నా, జీవితం ఉన్నతంగా ఉంటుందని చాలామంది అంటుంటారు. కానీ నల్లగొండ మండలం అన్నpuరెడ్డి గూడెం సర్పంచ్ తీగల యాదయ్య మాత్రం కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన యాదయ్య గతంలో హైదరాబాదులో డీసీఎం డ్రైవర్‌గా పని చేశాడు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో గ్రామస్థుల ఆదరణతో అన్నపరెడ్డి గూడెం సర్పంచ్‌గా గెలుపొందాడు. ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నాru. కుమార్తె డిగ్రీ ఫస్ట్ ఇయర్, కుమారుడు 10వ తరగతి చదువుతున్నారు. ardekaram భూమి ఉంది, సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామంలోనే ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నాడు.
ఈ క్రమంలో వ్యక్తిగత ఆదాయం లేకుండా పోయింది. పెరిగిన ఖర్చులు కుటుంబ బాధ్యతలను ఆయనను ఉక్కిరి బిక్కిరి చేయడంతో రూ.లక్ష అప్పు చేశాడు. ఇంట్లో పూట గడవని పరిస్థితి ఏర్పడింది.దీంతో తాను సర్పంచ్ అయినా కష్టపడి పని చేయాలని యాదయ్య నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు 2 నెలల క్రితం పాత ఆటో కొనుగోలు చేశాడు. నల్లగొండ పట్టణంలో ప్రయాణికులను తీసుకెళ్తూ డbbu సంపాదిస్తున్నాడు .
ఒకవైపు సర్పంచ్‌గా, సేవ చేస్తూనే మరోవైపు సామాన్యుడిలా కష్టపడుతున్న తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కష్టపడి పని చేయడంలో తప్పులేదు.ఏ పని చిన్నది కాదు. నా కుటుంబం కోసం కష్టపడి పని చేయడం నాకు గర్వంగా ఉంది. సర్పంచ్‌గా ఎన్నికైనందున ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత. కానీ కుటుంబ బాధ్యతలు కూడా నేను చూసుకోవాలి. ఎవరినీ మోసం చేయకుండా, నా శ్రమతోనే డబ్బు సంపాదిస్తాను. తీగల యాదయ్య సర్పంచ్.
