
సీజీఆర్ సేవలు ప్రశంసనీయం
ది లీడర్స్ డైరీ: గ్రామ అభివృద్ధికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశం సనీయమని అన్మాస్పల్లి గ్రామ సర్పంచ్ శ్రీనునా యక్ అన్నారు. శుక్ర వారం మండల పరిధి లోని అన్మాస్పల్లి గ్రామ పంచాయతీకి సీజీ ఆర్ సంస్థ తరుపున అందించిన వాటర్ ట్యాంకర్ను వార్డు సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీకి వాటర్ ట్యాంకర్ను అందించాలని, గతంలో సీజీఆర్ సంస్థ వ్యవస్థాపకులు లీలమ్మ, లక్మారెడ్డిని కలిసి విన్నవించడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రామాభివృద్ధికి చేయూతనందించడంలో భాగంగా సీజీఆర్ సంస్థ నిర్వాహకులు వాటర్ ట్యాంకర్ అంద జేసిన్నట్లు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సీజీ ఆర్ సంస్థ అందిస్తున్న అభినందనీయమని, రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధికి మరింత చేయూతనందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేశ్యా దవ్, వార్డు సభ్యులు పద్మరాజుగౌడ్, జగన్ గౌడ్, ప్రశాంత్, మోతీలాల్, రేణుకశివ, దేవూ లానాయక్, విజయకిషన్, పంచాయతీ కార్యదర్శి ఇందిరా పాల్గొన్నారు.
